Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రస్తుతం మళ్లీ వార్తల్లో నిలిచాడు. అయితే, ఈసారి అతడు వార్తల్లోకి రావడానికి క్రికెట్ కారణం కాదు.. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ అంత్యక్రియలు (జనాజా). ఈ అంత్యక్రియల వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందులో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ (LeT), దానికి అనుబంధ రాజకీయ విభాగమైన ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (PMML) కు చెందిన పలువురు కీలక నేతలు, కార్యకర్తలు హాజరయ్యారనే వాదనలు వెలువడటం తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల ప్రకారం.. షాహిద్ అక్తర్ అంత్యక్రియల ప్రార్థనలు ఇస్లామాబాద్‌లోని హెచ్-8 (H-8) స్మశానవాటికలో జరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఇనామ్-ఉర్-రెహమాన్‌తో పాటు పలువురు అనుమానిత వ్యక్తులు ఈ జనాజాలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలను పీఎమ్ఎమ్ఎల్ (PMML) అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలోనే షేర్ చేసినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు ఈ పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ రాజకీయ ముసుగుగా పనిచేస్తుందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. అంతేకాకుండా, పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరీతో ఇనామ్-ఉర్-రెహమాన్ కలిసి ఉన్న కొన్ని పాత ఫోటోలను కూడా ఇప్పుడు నెటిజన్లు బయటకు తీసి వైరల్ చేస్తున్నారు.
Also Read
- Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ఇదిలా ఉంటే, షోయబ్ అక్తర్ సోదరుడి మృతి పట్ల పాకిస్థాన్ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ స్వయంగా షోయబ్ అక్తర్ నివాసానికి చేరుకుని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. షాహిద్ అక్తర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ కష్టసమయంలో అక్తర్ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించినట్లు నేషనల్ అసెంబ్లీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఓ అంతర్జాతీయ క్రికెటర్ కుటుంబ సభ్యుడి అంత్యక్రియల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు బహిరంగంగా కనిపించడం పాకిస్థాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ల స్వేచ్ఛపై మళ్లీ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాకిస్థాన్‌లోని కొన్ని నిషేధిత సంస్థలు వేర్వేరు పేర్లతో, రాజకీయ వేదికల ముసుగులో తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయనే అంతర్జాతీయ ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.
తాజావార్తలు
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!