కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘోస్ట్’ హై ఆక్టేన్ యాక్షన్ పిక్చర్‌గా రూపొందించబడింది. ‘బీర్బల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు.ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు నిర్మాత సందేశ్ నాగరాజు తన సందేశ్ ప్రొడక్షన్స్ క్రింద ఈ భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు..హై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ” ఘోస్ట్” మూవీ అక్టోబర్ 19 న విడుదల కాబోతుంది.ఆకట్టుకునే పోస్టర్ తో విడుదల తేదిని అనౌన్స్ చేసారు.శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ లో వున్న పోస్టర్ ను విడుదల చేసారు.అయితే శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా “ఘోస్ట్” ప్రపంచం నుండి బిగ్ డాడీ టీజర్ ను ప్రత్యేకంగా విడుదల చేసారు.టీజర్ ఒక పాడుబడిన భవనంతో మొదలవుతుంది.,
ఆ భవనంలో ఒకరిని పట్టు కోవడానికి సహాయకులు చుట్టుముట్టగా బ్యాక్‌గ్రౌండ్ లో ఒక వాయిస్ ఆ మనుష్యులతో అతను ఎంత ప్రమాదకరమో జాగ్రత్తగా ఉండమని చెబుతుంది..అప్పుడు శివరాజ్ కుమార్ క్యాంప్ ఫైర్‌తో పాటు డ్రింక్ మరియు పొగ తాగుతూ కనిపిస్తాడు. ఈ టీజర్ లో శివ రాజ్ కుమార్ ఎంట్రీ అద్భుత మైన ఎలివేషన్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సాగుతుంది. అలాగే టీజర్ లో .”నువ్వు తుపాకీ తో భయపెట్టనంత మందిని నా కళ్లతో భయపెట్టాను” శివ రాజ్ కుమార్ చెప్పిన డైలాగ్ సూపర్ గా ఉంటుంది అర్జున్ జన్య ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ సినిమా కు మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ ను అందించారు. అలాగే మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. దీనితో ఘోస్ట్ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో అక్టోబర్ 19న దసరా కు ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది.