NTV Telugu Site icon

Shivam Dube: గోల్డెన్ లెగ్.. ఆడిన మ్యాచ్ గెలవాల్సిందే

Shivam Dube

Shivam Dube

అతను అడుగుపెడితే మ్యాచ్ గెలువాల్సిందే.. అతని లెగ్ అలాంటిది. ఇంతకు ఏ ఆటగాడో అని అనుకుంటున్నారా..? మన టీమిండియాకు చెందిన యువ క్రికెటర్ శివం దూబే. ఇటీవల భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో గెలుచుకుంది. కాగా.. ఆల్ రౌండర్ శివం దూబే నాల్గవ, ఐదవ టీ20 మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించాడు. పూణేలో 15 పరుగుల తేడాతో, ముంబైలో 150 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.. అయితే, ఈ సిరీస్‌లో నితీష్ రెడ్డికి గాయం కారణంగా 31 ఏళ్ల దూబేకు భారత జట్టులో స్థానం లభించింది.

Read Also: Car Buying: ఫిబ్రవరిలో కారు కొనే వారికి గుడ్ న్యూస్.. ఈ కార్లపై బంపర్ ఆఫర్..!

శివం దూబే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 30 మ్యాచ్‌లను గెలిచిన జట్టులో భాగమైన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. దూబేకు భారత్ తరపున ఇది వరుసగా 30వ టీ20 విజయం కావడం గమనార్హం. 2019 నవంబర్ 3న ఢిల్లీలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో దూబే అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తరువాత బంగ్లాదేశ్ తో 5వ టీ20లో కూడా భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి దూబే ఆడిన ఏ టీ20 మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోలేదు. వరుసగా 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Read Also: CM Revanth Reddy : బీఆర్‌ఎస్‌, బీజేపీలకు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌

ఈ ఘనత సాధించిన శివం దూబేకు చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) అభినంద‌నలు తెలిపింది. “దూబే ఆడితే భార‌త్ గెల‌వాల్సిందే. దూబే ఆడిన 30 మ్యాచ్‌ల్లోనూ భార‌త్ వ‌రుస‌గా విజ‌యం సాధిచింది” అని ఎక్స్‌లో తెలిపింది.