Site icon NTV Telugu

Shivaji-Chinmayi : శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్

Shivaji, Chinmayi

Shivaji, Chinmayi

ప్రస్తుతం సోషల్ మీడియాలో నటుడు శివాజీ మరియు సింగర్ చిన్మయి శ్రీపాద మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆడవారి దుస్తుల గురించి శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక పక్క శివాజీ తన మాటల్లో తప్పు లేదంటుంటే.. చిన్మయి మాత్రం ఆయన వాడిన భాషపై తీవ్రంగా మండిపడుతోంది. అసలు విషయం ఏంటంటే..

Also Read : Mamitha Baiju: ఆ క్రికెటర్ చేతిలో మమితా బైజు పెళ్లి బాధ్యతలు.. లవ్ మెసేజ్‌లన్నీ ఆయనకే వెళ్తాయట!

రీసెంట్ గా ఒక కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, హీరోయిన్లు సినిమా ఈవెంట్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని సలహా ఇచ్చారు. సావిత్రి, సౌందర్య లాంటి వారు ఎంత నిండుగా ఉండేవారో గుర్తు చేస్తూ.. ఇప్పుడు రష్మిక కూడా చక్కగా బట్టలు వేసుకుంటుందని మెచ్చుకున్నారు. అయితే, గ్లామర్ పేరుతో హద్దులు మీరితే గౌరవం ఉండదని, ‘సామాన్లు’ కనిపించేలా బట్టలు వేసుకుంటే జనం నవ్వుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. స్త్రీ అంటే ప్రకృతి అని, పద్ధతిగా ఉంటేనే గౌరవం పెరుగుతుందని శివాజీ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై చిన్మయి ఎప్పటిలాగే ట్విట్టర్ (X) వేదికగా ఫైర్ అయ్యారు.

శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి ‘దరిద్రపు ముండ’ వంటి పదాలు వాడటాన్ని ఆమె తప్పుబట్టారు. “మీరు మాత్రం జీన్స్, హూడీలు వేసుకుంటారు కానీ, హీరోయిన్లు మాత్రం పద్ధతిగా ఉండాలా? మీకు అంతగా భారతీయ సంస్కృతి మీద ప్రేమ ఉంటే.. మీరు కూడా  దోతీలు, కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టెలు పెట్టుకుని తిరగండి” అంటూ  స్పందించింది. షూటింగ్ సెట్స్‌లో మహిళలను ఇలాగేనా గౌరవించేది అంటూ ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మాటల యుద్ధం ఎంత వరకు సాగుతుందో చూడాలి.

 

Exit mobile version