NTV Telugu Site icon

Danush : ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’లో శివరాజ్ కుమార్

Shivaraj Kumar

Shivaraj Kumar

నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40 నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనిని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి.జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహ నిర్మాతలు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Also Read : Team India: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టెస్ట్ జట్టులో ఉనద్కట్‌కు చోటు
తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. ధనుష్ కి జోడిగా ప్రియాంక మోహన్, నివేదిత సతీష్ నటిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.