NTV Telugu Site icon

Shiv Sena: ఈ రోజే శివసేన-యూబీటీ తొలి జాబితా

Uddhav Thackeray

Uddhav Thackeray

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది. ఈ జాబితాలో 15 నుంచి 16 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం నాడు ఈ సమాచారం ఇస్తూ, రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ)లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ మొదటి జాబితాలో 15- 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పార్టీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.

Read Also: Tragedy Holi celebrations: హోలీ సంబరాల్లో విషాదం.. స్నేహితుని రక్షించబోయి నీట మునిగిన వ్యక్తి..!

ఇక, ఇవాళ శివసేన (యూబీటీ) తొలి జాబితాను విడుదల చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ముంబై నార్త్‌వెస్ట్‌ నుంచి అమోల్‌ కీర్తికర్‌, సాంగ్లీ నుంచి చంద్రహర్‌ పాటిల్‌, రాయ్‌గఢ్‌ నుంచి అనంత్‌ గేటేలకు టికెట్‌ ఇవ్వవచ్చని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఠాక్రే సంకేతాలు ఇచ్చారు. మరో వైపు, MVA భాగస్వామ్యమైన NCP (శరద్‌చంద్ర పవార్) పార్టీ కూడా తన అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు, కాంగ్రెస్, కూటమి భాగస్వాములతో గొడవలు లేని కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది.

Read Also: Unique Tradition: మగాళ్లు చీరలు కట్టుకుని మహిళల్లా.. రతి మన్మథుడి అనుగ్రహం కోసం..?!

అలాగే, INDIA బ్లాక్‌లో సభ్యులుగా ఉన్న MVA నియోజక వర్గాలు తమ సీటు షేరింగ్ ను ఇంకా ఖరారు చేసుకోలేదు.. ఉత్తరప్రదేశ్ (80) తర్వాత అత్యధికంగా 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనున్న ఐదు స్థానాలకు నామినేషన్ల దాఖలుకు రేపే (మార్చి 27) చివరి తేదీ కావడంతో.. ఈ నియోజకవర్గాలకు నామినేషన్లు వేయని పార్టీలు నేటిలోగా నామినేషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.