NTV Telugu Site icon

Maharashtra: మహారాష్ట్రలో సీట్ల పంచాయితీ.. శివసేన- బీజేపీ- ఎన్సీపీల మధ్య లొల్లి

Maharastra

Maharastra

2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 80 నుంచి 90 సీట్లను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల్లో 80- 90 స్థానాల్లో పోటీ చేస్తామనే షరతుతోనే అజిత్ పవార్ వర్గం బీజేపీ, శివసేనలతో పొత్తు పెట్టుకుందని ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మాకు చాలా తక్కువ సీట్లు ( బారామతి, షిరూర్, రాయగడ, ధరాశివ్) మాత్రమే ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

Read Also: Bachhala Malli : అల్లరి నరేష్ “బచ్చల మల్లి” ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..

కాగా, దీనిపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. ఎక్కువ సీట్లు మనకే వస్తాయని చెప్పారు. అయితే, సీట్ల పంపకాల ఫార్ములాపై మూడు పార్టీల నేతల సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 29 స్థానాల్లో పోటీ చేస్తుంది.. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు మనకే వస్తాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పెంపు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..!

అలాగే, సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన లోక్‌సభ ఎన్నికలలో 15 స్థానాల్లో పోటీ చేస్తుంది.. అలాగే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 50 నుంచి 60 సీట్లలో పోటీలో ఉంటామన్నారు. కేవలం 50 సీట్లు వస్తే ఎన్ని గెలుస్తామని సీఎం షిండే అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకుంది. అలాగే, అజిత్ పవార్ కూడా లోక్‌సభ ఎన్నికల కంటే అసెంబ్లీపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని చెప్పారు. ఇక, ఈ ఎన్నికల్లో చాలా సంతోషంగా ఉండొద్దు.. ఓడిపోతే బాధపడవద్దని ఇటీవల కార్యకర్తలకు సూచించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలి.. అంతకంటే ముందు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.