NTV Telugu Site icon

Eknath Shinde : ఆయనో రాష్ట్రానికి సీఎం.. అయితేనేం మనుమడు చెప్తే వినాల్సిందే

Eknath

Eknath

Eknath Shinde : ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయితేనేం సీఎం, పీఎం ఎవరైనా మనుమడి మాటల తలొగ్గాల్సిందే.. వాళ్లు మంకు పట్టు తీర్చాల్సిందే. ఈ మాట ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విషయంలో జరిగింది. సాధారణంగానే రాష్ట్రానికి అధిపతిగా ఉన్నా కూడా ఆయన తన కార్యకర్తలో కలిసిమెలిసి ఉంటారు. అందుకే ఆయనను కార్యకర్త లేదా ప్రజా-ఆధారిత నాయకుడు అనే పేరుతో అభిమానులు పిలుచుకుంటారు. గతంలోనూ గణపతి ఉత్సవాల్లో ఇంటింటికీ వెళ్లి తన కార్యకర్తలను ఉత్సాహపరిచాడు. నవరాత్రి ఉత్సవాల్లో, అతను తన థానేలోని టెంభి నాకాలో కూడా నవరాత్రి పండుగను నిర్వహించుకున్నారు. ఇప్పుడు, సీఎం షిండే థానేలో తాను పెరిగిన వీధిలో హోలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కిసాన్‌నగర్ చేరుకున్నారు. ఈసారి మనవడితో కలిసి హోలీని ఆస్వాదించాడు. ఇదే క్రమంలో మనవడి ఒత్తిడితో సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతని వీడియో వైరల్ అవుతోంది.

Read Also: Bill Gates: ఇండియాలో ఆటో నడుపుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్

కిసాన్‌నగర్‌లో జరిగిన హోలీ పండుగలో ముఖ్యమంత్రి షిండే మనవడితో కలిసి పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే అతనితో పాటు ఉన్న మనవడు దగ్గర్లోని దుకాణంలో ఏదైనా కొనాలని పట్టుబట్టాడు. అందుకే, ముఖ్యమంత్రి షిండే స్వయంగా తన మనవడితో సమీపంలోని కిరాణా దుకాణానికి చేరుకున్నారు. ఈ సమయంలో వారితోపాటు పెద్ద ఎత్తున జనం కూడా ఉన్నారు. అకస్మాత్తుగా తన కిరాణా దుకాణానికి వచ్చిన ముఖ్యమంత్రిని చూసి దుకాణదారుడు అవాక్కయ్యాడు. ముఖ్యమంత్రి తన మనుమడు రుద్రాంశ్ కోసం రెండు బంతులు కొన్నారు.