Site icon NTV Telugu

Shikhar Dhawan: సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్.. ఇన్ స్టా పోస్టులో కన్ఫర్మ్ చేసిన మాజీ క్రికెటర్

Shikhar Dhawan

Shikhar Dhawan

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, సోఫీ షైన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. తన మొదటి భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత, శిఖర్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరి 12వ తేదీ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన, సోఫీ నిశ్చితార్థం వార్తను శిఖర్ వెల్లడించారు.

Also Read:MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి

ఉంగరంతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, వారు ఇప్పుడు ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాసుకొచ్చారు. శిఖర్ పోస్ట్‌లో, పంచుకున్న చిరునవ్వుల నుండి పంచుకున్న కలల వరకు.. మేము ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. మా ఎంగేజ్‌మెంట్‌కు అందించిన ప్రేమ, ఆశీస్సులు, మంచి కోరిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. ఈ వార్తతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. క్రికెటర్, అతని కాబోయే భార్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

శిఖర్ కాబోయే భార్య సోఫీ షైన్ ఎవరు?

సోఫీ షైన్ 1990లో ఐర్లాండ్‌లో జన్మించిన మోడల్. ఆమె కార్పొరేట్ ప్రపంచంలో కూడా విస్తృతంగా పనిచేసింది. ఆమె ప్రస్తుతం శిఖర్ ధావన్ కంపెనీ డా వన్ స్పోర్ట్స్‌కు CEOగా ఉన్నారు. సోఫీ, శిఖర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వారు మొదట దుబాయ్‌లో కలుసుకున్నారు. అక్కడ క్రికెటర్ మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2025 ఐపీఎల్ సమయంలో వారిద్దరూ కలిసి ఎక్కువగా కనిపించారు. కొంతకాలం తర్వాత, శిఖర్ సోఫీతో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read:Anchor Shyamala: రెడ్‌ బుక్‌పై యాంకర్‌ శ్యామల హాట్‌ కామెంట్స్‌.. కోడి కోసినా.. కేక్‌ కట్ చేసినా కేసులే..!

శిఖర్ ధావన్ మొదటి భార్య ఎవరు?

శిఖర్ ధావన్ మొదట 2012 లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. ఆమె భారత్ లో జన్మించింది కానీ ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, వారు 2020 లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు 2023 లో తీసుకున్నారు.

Exit mobile version