Site icon NTV Telugu

Shefali Bagga: ‘చాహల్‌ వద్దు.. విరాట్ లాంటి వాడు కావాలి’ మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..

Shefali Bagga

Shefali Bagga

Shefali Bagga: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ధనశ్రీ వర్మతో విడిపోయిన తర్వాత చాహల్ పేరు పలువురితో వినిపించగా, గత కొంతకాలంగా క్రికెట్ హోస్ట్, నటి షెఫాలీ బగ్గాతో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఒక యాడ్‌లో నటించడం, బయట జంటగా కనిపించడంతో ఈ పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న షెఫాలీ ఈ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

READ ALSO: Bloomberg Billionaires Index 2026: ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. ముఖేష్ అంబానీ స్థానం ఎంతంటే?

ఆ ప్రశ్నలతో విసిగిపోయాను..
ఈ పాడ్‌కాస్ట్‌లో చాహల్‌తో డేటింగ్ వార్తలపై షెఫాలీ మాట్లాడుతూ.. “ఈ ప్రశ్నలతో నేను విసిగిపోయాను. కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి డిన్నర్‌కు వెళ్తే అది డేటింగ్ అని ప్రచారం చేయడం ప్రజల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి వార్తలు వినడానికి చాలా వింతగా అనిపిస్తాయి” అని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి తాను అస్సలు పట్టించుకోనని షెఫాలీ స్పష్టం చేశారు. తనకు, తన చుట్టూ ఉన్నవారికి నిజం ఏంటో తెలుసని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో తాను ఒక క్రికెటర్‌ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. తన ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను మిక్స్ చేయడం ఇష్టం లేదని అన్నారు.

విరాట్ కోహ్లీ లాంటి భాగస్వామి కావాలి..
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా షెఫాలీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.. “నాకు విరాట్ కోహ్లీ లాంటి భాగస్వామి కావాలి. విరాట్ – అనుష్క శర్మ జోడీ నాకు పర్ఫెక్ట్ కపుల్‌లా అనిపిస్తారు” అని తన మనసులో మాట బయటపెట్టారు. గతంలో బిగ్ బాస్ 13లో మెరిసిన షెఫాలీ బగ్గా, ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్‌గా, నటిగా తన కెరీర్‌లో దూసుకుపోతున్నారు.

READ ALSO: Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..

Exit mobile version