NTV Telugu Site icon

5K Run : షీ టీమ్స్ ఆధ్వర్యంలో రైజ్ అండ్ రన్.. పాల్గొన్న సీఎస్‌, డీజీపీ

5k Run

5k Run

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ ఆధ్వర్యంలో రైజ్‌ అండ్‌ రన్‌ పేరిట 5కే, 2కే రన్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఉన్న పీపుల్స్‌ప్లాజా వద్ద సోమవారం ఉదయం 5కే, 2కే రన్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. అయితే.. మహిళా భద్రతా, షీ-టీమ్‌లపై చైతన్యం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ రన్‌ను నిర్వహించారు. ఇందులో నగరంలోని యువతీ, యువకులు, మహిళా పోలీసులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Also Read : Sharwa 35: ‘రన్ రాజా రన్’ని గుర్తు చేస్తున్న శర్వా కొత్త సినిమా లుక్…

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ (C.V. Anand), మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్‌తోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Also Read : Kushi: లవ్ స్టొరీ కదా సార్… పీటర్ హెయిన్స్ తో ఫైట్ ఎందుకు?

మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని కేటీఆర్ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు పురపాలక శాఖ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణను ప్రకటించింది.