Site icon NTV Telugu

Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో 400 మంది పోకిరీలు అరెస్టు

Cp Anand

Cp Anand

గణేష్ ఉత్సవాల్లో దాదాపు 400 మందికి పైగా పోకిరీలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిమజ్జనం పనులను ఆయన పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌ దగ్గర గణేశ్‌ నిమజ్జనం ముగిసిందని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతిని అనుకున్న సమయం కంటే ముందుగా నిమజ్జనం చేశామన్నారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం పది వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి చేశామని సీపీ తెలిపారు. ఈసారి భారీగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యమైందన్నారు. గతే ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారు.. అందుకే ఈ నిమజ్జనాల సందర్భంగా ప్రత్యేకంగా షీ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

Read Also: YS Jagan: రూటు మార్చిన వైఎస్‌ జగన్‌.. పార్టీ కార్యక్రమాలపై ఫోకస్

అయితే, ఉత్సవాలకు వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం వంటిచి చేసిన 400 మందిపై కేసులు నమోదు చేశారని సీపీ ఆనంద్ వెల్లడించారు. పవిత్రమైన శోభాయాత్రకు కొందరు మద్యం తాగి వచ్చారని, అలాంటి వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. మిలాదునబీ పండుగ సందర్భంగా ముస్లి మత పెద్దలు గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వినాయకచవితి ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్టోబర్ 1న పండుగ ర్యాలీ నిర్వహించుకునేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలిపిన సీపీ, మిలాదునబీ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆసభ్యంగా ప్రవర్తించిన పోకిరిలపై స్పై ఆపరేషన్ చేసి షీ పట్టుకుందని హైదరాబాద్ సీపీ తెలిపారు.

Read Also: Monsoon Tomato Cultivation: వర్షాకాలంలో టమోటా సాగులో మెళుకువలు..

ఇక, ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర సందర్భంగా రద్దీ ప్రదేశాలు, మహిళలు ఎక్కువ మంది వచ్చే ప్రదేశాల్లో షీ టీమ్లను ఏర్పాటు చేసినట్లు సీపీ ఆనంద్ చెప్పారు. ఎక్కడా నేరాలు జరుగకుండా, మహిళ భద్రతకు ప్రధాన్యత ఇస్తూ చైన్ స్నాచింగులు, చోరీలు, వేధింపులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై ఎక్కడా ఫిర్యాదులు అందలేదు అని సీపీ అన్నారు. నిమజ్జనం సందర్భంగా చాలా మంది మద్యం సేవించి వచ్చారని, ప్రమాదకరంగా వాహనాలపై డాన్సులు చేస్తూ వచ్చారు, అసభ్యకరమైన పాటలకు డాన్స్‌లు చేశారని ఆయన చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేయడంలో సిటీ పోలీసులు అధికారులు తీవ్రంగా కష్టపడ్డారని, వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు సీపీ ఆనంద్ అన్నారు.

Exit mobile version