Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 30న శశి థరూర్ నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే ఆ అభ్యర్థి పేరును దేశంలోని 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్రతిపాదించాలి. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఐదు సెట్ల నామినేషన్ పేపర్స్ సిద్ధం చేసుకుని వివిధ రాష్ట్రాల్లోని పార్టీ ప్రతినిధులను సంప్రదిస్తున్నారు. ఇదిలావుండగా, గాంధీ కుటుంబానికి చెందని నేత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న సందర్భం 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాబోతోంది. సీతారాం కేసరి నుంచి 1998లో ఆ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ స్వీకరించారు. సీతారాం కేసరి 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్‌లను ఓడించి, ఆ పదవిని చేపట్టారు.
Sonia Gandhi: సోనియాగాంధీతో లాలూ, నితీష్ భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
- Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
- Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీ కోరినా రాహుల్‌గాంధీ నిరాకరించారు. రాహుల్ ప్రకటనతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఎంపీ శశిథరూర్ పార్టీ అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. మరికొంది నేతల పేర్లు వినిపించినా చివరిగా ఈ ఇద్దరి పేర్లు మాత్రమే ఖరారయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం పైన పేర్కొన్న ఎన్నికలు అన్ని పీసీసీలలో అక్టోబర్ 17న నిర్వహించబడతాయి, దీని ఫలితాలు ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే అక్టోబర్ 19న ప్రకటించబడతాయి. అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్ 8 సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తారు.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
-
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
-
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?