బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా వసూళ్ల సునామిని సృష్టించాయి.. నిజానికి షారూఖ్ ఖాన్ 2018 తర్వాత సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకున్నాడు కానీ కింగ్ ఖాన్ తిరిగి వచ్చిన సంవత్సరంగా 2023ని, అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.. షారుఖ్ ఇటీవల మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు..
షారుఖ్ ఖాన్ మూడు చిత్రాలకు పనిచేశాడు.. పఠాన్, జవాన్ మరియు డంకీ గత ఏడాది విడుదలయ్యాయి. అయితే తన తర్వాత చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు మరో సినిమాలో చేయబోతున్నట్లు ప్రకటించారు.. మార్చి లేదా ఏప్రిల్ లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పాడు. షారూఖ్ నటించిన డుంకీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. పఠాన్ మరియు జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లు వసూలు చేసినప్పటికీ, డుంకీ ప్రారంభం అంత ఆశాజనకంగా లేదు. ఈ చిత్రం తొలిరోజు దేశీయంగా రూ.30 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది..
ఇదిలా ఉండగా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రం పఠాన్ కు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది..వైఆర్‌ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించారు.. ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘పఠాన్ 2’ తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.ఆల్రెడీ ‘పఠాన్ 2’ స్క్రిప్ట్ వర్క్ మొదలైందని, స్టోరీ బేసిక్ ఐడియాకు షారుక్ ఖాన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, వైఆర్‌ఎఫ్ స్పై యూనిర్స్‌లో భాగంగానే ‘పఠాన్’ ఉంటుందని బాలీవుడ్ లో టాక్.. ఈ ఏడాది చివరిలో సినిమా ప్రారంభం కానుందని సమాచారం..