Site icon NTV Telugu

Vijaysai Reddy: చంద్రబాబు ఆనందం కోసం షర్మిల మాట్లాడుతున్నారు

Vijayasia Reddy

Vijayasia Reddy

Vijaysai Reddy Press meet on Sharmila: వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రముఖుల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. షర్మిలమ్మ ట్వీట్ లో, ప్రెస్ మీట్ లో నాపేరు, కేవీపీ పేరు ప్రస్తావించారు. అయితే, షర్మిలమ్మకు కొన్ని ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందని, షర్మిల ప్రెస్ మీట్ లో 95% జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే అని అర్థం అవుతుందని తెలిపారు. విజయమ్మ కన్నీళ్లు తుడ్చడానికి ప్రెస్ మీట్ లు పెట్టలేదు. చంద్రబాబు ఆనందం కోసం షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని చంద్రబాబు ఎజెండాతో షర్మిల పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Raghunandan Rao: హైదరాబాద్‌ శివార్లలో డ్రగ్స్‌ పార్టీపై స్పందించిన ఎంపీ రఘునందన్‌ రావు

పీసీసీ చీఫ్ గా లేదా జగన్ చెల్లిగా.. వైయస్ కూతురుగా ప్రెస్ మీట్ పెడుతున్నారా.? చంద్రబాబు ఆనందం కోసమా అని ఆయన అడిగారు. మీరు కాంగ్రెస్ లో ఉంటూ చంద్రబాబుకు ఎన్డీయే కు సపోర్ట్ చేస్తున్నారా.? తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి మీకేం న్యాయం చేస్తాడని షర్మిల అన్నారు.. ఎంత ద్రోహం ఇది. బాబు మీదనా.. జగన్ మీదనా ఎవరి మీద మీ కోపం.. అంటూ పలు ప్రశ్నలను ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Gold Smuggling: ప్రైవేట్ పార్ట్‌లో కిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన ఘనుడు

తల్లిని చెల్లిని మోసం చేశాడని అనేది చంద్రబాబు ఇచ్చిన బ్రాండింగ్ అని.. దాన్ని మీరు పాటిస్తున్నారని, జగన్ పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలని షర్మిల ద్వారా చంద్రబాబు ప్లాన్ చేశాడని ఆయన మాట్లాడారు. కోటిన్నర మంది మహిళలకు అన్యాయం చేయని జగన్.. బాబు చెప్పగానే ప్రజలు నమ్ముతారా అంటూ.. షర్మిల ఆత్మ విమర్శ చేసుకోండి.. గుండె మీద చేయి వేసుకుని చెప్పండని ఆయన అన్నారు. మీ నాన్న చనిపోవడానికి కారణం ఎవరో మీకు తెలియదా.? నాన్న మరణానికి కారణం అయినా వారితో మీరు కుమ్మకు అయ్యారని అయ్యన అన్నారు. అలాగే నా తండ్రి మరణానికి చంద్రబాబు కారణం అని ఎన్నో వేదికల మీద చెప్పారని, మరణానికి కారణం అయినా కాంగ్రెస్ తో బాబు తో పని చేయడం ఎంత దుర్మార్గం అంటూ అయన మండి పడ్డారు. అలాగే వైఎస్ మరణానికి పదిహేను రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని.. అందులో వైఎస్ దుర్మార్గంగా చస్తాడని బాబు చెప్పాడంటూ వ్యాఖ్యానించారు.

Exit mobile version