Site icon NTV Telugu

Vineeta Singh: బ్రతుకుండగానే చంపేశారు.. వదంతులపై క్లారిటీ

Sing

Sing

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విపరీతమైన ధోరణి ఎక్కువైపోయింది. అడ్డు అదుపులోకుండా పోస్టులు పెట్టడం.. ఇతరుల వ్యక్తిగత జీవితాలను భంగం కలిగిస్తున్నారు. తాజాగా వెలుగు చేసిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. బ్రతుకున్న ఓ వ్యాపార వేత్త సోషల్ మీడియా వేదిక చంపేశారు. ఈ పరిణామాలతో ఆమె షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చుకోవల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: Vishal : విజయ్ సినిమా డైరెక్ట్ చేసేందుకు విశాల్ యత్నం!

వ్యాపారవేత్త, షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమ న్యాయమూర్తి వినీతా సింగ్‌ మరణించారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. ఆమె మొబైల్‌కు ఫోన్లు రావడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆమె తాను మరణించాననే వదంతులు గత నెల రోజులుగా వస్తున్నాయని తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు, సైబర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా వదంతులు కొనసాగుతూనే ఉన్నాయని ఆమె వాపోయారు. బంధువులు, స్నేహితులు నిజమనుకొని తరచూ కాల్స్‌ చేస్తున్నారన్నారు. ఈ సమస్యను ఎలా నివారించాలో సలహాలు ఇవ్వాలని వినీతా నెటిజన్లను కోరారు.

ఇది కూడా చదవండి:Nagari: మంత్రి రోజాకు షాక్‌.. టీడీపీ గూటికి మంత్రి ప్రధాన అనుచరుడు..

ఆమె అభ్యర్థనపై నెటిజన్లు స్పందించి ఆందోళన వ్యక్తంచేశారు. ఇటువంటి ఫేక్‌న్యూస్‌ వ్యాప్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పోస్టు వైరల్‌ అవడంతో ముంబై పోలీసులు స్పందిస్తూ తమను కలవాల్సిందిగా పోస్టు పెట్టారు. దీంతో తనకు మద్దతుగా నిలిచినందుకు నెటిజన్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. షార్క్ ట్యాంక్ ఇండియా… దేశంలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించే టీవీ షో. ఇందులో వినీతాసింగ్‌ న్యాయనిర్ణేతగా ఉన్నారు. అంతేకాకుండా తన భర్త కౌశిక్‌తో కలిసి షుగర్‌ కాస్మొటిక్స్‌ సంస్థను ప్రారంభించి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

 

Exit mobile version