Site icon NTV Telugu

Share Market Opening: గ్రీన్ కలర్లో ప్రారంభమైన మార్కెట్లు.. 350 పాయింట్ల లాభం

Today Stock Market Roundup 05 04 23

Today Stock Market Roundup 05 04 23

Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను శుభారంభం చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ఊపందుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. అంతేకాకుండా వడ్డీ రేట్ల పెంపుదల ఉండదన్న సంకేతాలు కూడా మార్కెట్‌ను బలపరుస్తున్నాయి. ఈరోజు వరుసగా రెండు రోజుల మార్కెట్ పతనం ఆగిపోవచ్చని తెలుస్తోంది. మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ దాదాపు 350 పాయింట్లు పెరిగింది. ఉదయం 9.20 గంటలకు 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా లాభపడి 65,580 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా దాదాపు 110 పాయింట్లు పెరిగి 19,550 పాయింట్లకు చేరుకుంది.

ప్రీ-ఓపెన్ సెషన్‌లో గ్రీన్ మార్కెట్
ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభానికి ముందు ప్రీ-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ సుమారు 375 పాయింట్ల పెరుగుదలను చూపగా నిఫ్టీ 85 పాయింట్ల వరకు బలంగా ఉంది. గిఫ్టీ సిటీలో నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండు రోజుల క్షీణత నుంచి గురువారం మార్కెట్‌కు ఉపశమనం లభించవచ్చని ఇది సూచిస్తోంది. అంతకుముందు బుధవారం మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ వారం ఇంతవరకు బాగాలేదు. అక్టోబరు 2వ తేదీ సెలవు కావడంతో వారంలో మొదటి రోజు మార్కెట్‌లో ట్రేడింగ్‌ జరగలేదు. ఆ తర్వాత మంగళ, బుధవారాల్లోనూ మార్కెట్ క్షీణించగా.. బుధవారం సెన్సెక్స్ 65,250 పాయింట్ల దిగువకు పతనమవగా నిఫ్టీ స్వల్పంగా 19,530 పాయింట్ల దిగువన ముగిసింది.

Read Also:Meenaakshi Chaudhary: కాటుక కన్నులతో కేకపుట్టిస్తున్న మీనాక్షి చౌదరి

ఊపందుకున్న గ్లోబల్ మార్కెట్లు
గ్లోబల్ మార్కెట్లు నిరంతర క్షీణత నుండి కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అమెరికా మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ బుధవారం 0.39 శాతం పెరిగింది. నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 1.35 శాతం లాభాన్ని నమోదు చేయగా, S&P 500 0.81 శాతం లాభాన్ని నమోదు చేశాయి. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 1.18 శాతం బలపడగా హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 0.60 శాతం బలపడింది.

ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాల్లో పెద్ద స్టాక్స్
నేటి ట్రేడింగ్‌లో భారీ స్టాక్‌లు కూడా శుభారంభం చేశాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 26 గ్రీన్ జోన్‌లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్‌లో టాటా మోటార్స్, టైటాన్ 1 శాతం కంటే బలంగా ఉన్నాయి. ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లు కూడా మార్కెట్‌లో ముందున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు పడిపోయాయి.

Read Also:Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 మినీ లాంచ్ ఈవెంట్.. ఈ వారం మరో ఆరుగురు ఎంట్రీ..

Exit mobile version