లండన్ వేదికగా ఆస్ట్రేలియతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ లో అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానే కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానేకు అవకాశం ఇచ్చారు.
Also Read : అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన 10 అగ్నిపర్వతాలు
దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్ కు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్ ను సెలక్టర్లు పిలుపినిచ్చారు. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కట్ తో పాటు అదనపు పేసర్ గా శార్థూల్ ఉండనున్నాడు.
Also Read : Horror: అప్పుడు ‘రాజుగారి గది’… ఇప్పుడు ‘రాణిగారి గది…’!
అదే విధంగా ప్లేయింగ్ ఎల్ వన్ లో కూడా శార్థూల్ చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే శార్థూల్ ఠాకూర్ కు ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంలో ఓ ఫోర్ వికెట్ హాల్ తో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా అతని ఖాతాలో ఉంది. ఒక ఓవరాల్ గా భారత తరపున 8 టెస్టు మ్యాచ్ లు ఆడిన శార్థూల్.. 27వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కలేదు. తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ ను తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ.. రహానే వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.
