Shardul Thakur: ఆస్ప‌త్రి బెడ్ పై టీమిండియా స్టార్ ప్లేయర్..

  • గ‌త కొంత‌కాలంగా చీల‌మండ‌ల గాయంతో బాధ‌ప‌డుతున్న శార్దూల్ ఠాకూర్.
  • సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
  • ఈ క్ర‌మంలో గాయానికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు.
Shardul Thakur

Shardul Thakur

ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బిజీగా ఉంది. అయితే, భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసుపత్రి బెడ్‌ పై ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దింతో టీమిండియా అభిమానులు అయోమయంలో ఉన్నారు. అయితే అసలు అతనికి ఏమి జరిగిందో అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, చీల మండ‌ల గాయంతో గత కొంతకాలంగా ఆయనకీ గాయాలయ్యాయి. ఈ కరంగా తాజాగా అతను తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ విజయవంతమైన సందర్భంలో.. అతి త్వరలో మైదానంలో కలుద్దాం. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. అంటూ., ఠాకూర్ తన కాలును హాస్పిటల్ బెడ్‌పై కట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు త్వరలో కోలుకొని మైదానంలోకి దిగుతారని ఆశిస్తున్నారు.

Crime News: బూతు వీడియోలు చూపిస్తూ బాలుడిపై టీచర్ అత్యాచారం..

ఇక కొన్ని నివేదికల ప్రకారం., శార్దూల్ ఠాకూర్ గత కొంతకాలంగా చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను తన 17వ సీజన్‌లో నొప్పిని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగాడు. ఆ సమయంలో నొప్పి తగ్గేందుకు ఇంజెక్షన్లు తీసుకున్నారు. అయినా అవి పెద్దగా ప్రభావం చూపకపోవడంతో చివరకు సర్జరీ చేయించుకున్నారు. ఇక ఇది వరకు మహ్మద్ షమీకి ఆపరేషన్ చేసిన అదే వైద్యుడు ఠాకూర్‌కు కూడా శస్త్రచికిత్స చేసాడు.

Pawan Kalyan: జనసైనికులకు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి.. 20 తర్వాత నేనే కలుస్తా..