NTV Telugu Site icon

Maharashtra: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..

Shard Power

Shard Power

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్సీపీ ( ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాబోయే కొన్నేళ్లలో కాంగ్రెస్‌కు చాలా పార్టీలు దగ్గరవుతాయని ప్రతిపక్ష సీనియర్‌ నేత అన్నారు. ఇది మాత్రమే కాదు, వారిలో కొందరు కాంగ్రెస్‌లో తమ పార్టీలను కూడా విలీనం చేసే అవకాశం కూడా ఉందన్నారు. ఇక, ఇది మీ పార్టీకి కూడా వర్తిస్తుందా అని శరద్ పవార్‌ని అడిగినప్పుడు.. దీనిపై పవార్ రిప్లై ఇస్తూ.. ‘కాంగ్రెస్‌కి, నా పార్టీకి మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు.. సైద్ధాంతికంగా మనం గాంధీ, నెహ్రూల పంథానే అనుసరిస్తాం.. నేనేమీ ఇప్పుడే చెప్పను.. పార్టీలోని అందరితో మాట్లాడకుండా ఏలాంటి హామీ ఇవ్వడం కుదరదు అని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.

Read Also: KTR: నీకు దమ్ముందా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

కాగా, సైద్ధాంతికంగా మేం కాంగ్రెస్‌కు దగ్గరగా ఉన్నాం అని ఎన్సీపీ (ఎస్పీ) శరద్ పవార్ తెలిపారు. ఏదైనా నిర్ణయం సమిష్టిగా మాత్రమే తీసుకోబడుతుంది.. నరేంద్ర మోడీతో రాజీ పడటం కష్టం అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మిత్రపక్షమైన ఉద్ధవ్ సేన గురించి కూడా మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే సానుకూల నాయకుడు.. ఆయన ఆలోచనా విధానం మాకు అర్థమైంది.. అతనికి మనలాంటి అభిప్రాయాలే ఉన్నాయన్నారు.

Read Also: Swim Suits : మండుతున్న సూరీడు.. పొట్టి బట్టలకు భారీగా పెరిగిన డిమాండ్

అయితే, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా అండర్ కరెంట్ ఉందని శరద్ పవార్ ఒక పెద్ద జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీని ఇష్టపడని పార్టీలు చాలానే ఉన్నాయి.. కాబట్టి ఈ వ్యక్తులు కలిసి రావొచ్చు.. ఇప్పుడు దేశ మూడ్ మోడీకి వ్యతిరేకంగా మారింది.. ఈ ఎన్నికలు 2014, 2019కి భిన్నంగా ఉండబోతున్నాయన్నారు. ఇక, తొలిసారిగా ఓటు వేయబోతున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది.. వీరికి మోడీ ప్రభుత్వం అంటే పెద్దగా ఇష్టం లేదన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడిన అనేక పార్టీల నాయకత్వం ఇప్పుడు రెండో తరం చేతిలో ఉన్న తరుణంలో శరద్ పవార్ ఈ కామెంట్స్ చేశారు. ఇక, ఈ విషయాన్ని పవార్ బహిరంగంగా చెప్పకపోయినా.. కానీ, ఖచ్చితంగా తన పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావచ్చని సూచనలు మాత్రం ఇచ్చారు.