Game Changer : మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు మాత్రమం కుమ్మేసింది. ఫస్డ్ డే ఊహించని వసూళ్లు సాధించింది. చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారన్న సంగతి అర్థం అవుతుంది.
Read Also:South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్..
ఈ సినిమాలో అంజలి అలాగే కియార అద్వానీ హీరోయిన్లుగా నటించారు. మరి శంకర్ నుంచి తొలి తెలుగు సినిమా ఇది కావడంతో శంకర్ కూడా తన శైలిలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉంటే శంకర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి కథ మాత్రం తనది కాదట. మొదటిసారి తన కథ కాకుండా మరో దర్శకుడి కథతో తను సినిమా చేయడం జరిగిందన్నారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా బాగున్నప్పటికీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెగిటివ్ వచ్చిందని శంకర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం షాకింగ్ గా మారాయి. వాస్తవానికి గేమ్ ఛేంజర్ కి భారీ రన్ టైం తో కూడిన ఫుటేజ్ వచ్చింది అని చాలా సాలిడ్ సీన్స్ ని తాము నిడివి కోసం కట్ చేశామని ఈ విషయంలో తను కొంచెం డిజప్పాయింట్ గా ఉన్నానని చెప్పుకొచ్చిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదల అయిన తర్వాత ఇలా ఒకొక్కటిగా బయటకు వస్తుండడంతో మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Read Also:Nirmal District: కాశీ యాత్రకు వెళ్లిన వ్యక్తి సజీవ దహనం..