NTV Telugu Site icon

Shanampudi Saidi Reddy : మంచిని పక్కన పెడితే… నేను ఏం చేయగలనో అందరికీ తెలుసు…

Shanampudi Saidi Reddy

Shanampudi Saidi Reddy

మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆయన పార్టీని, ఆయన తొత్తుల తోలు తీస్తానని ఆయన వ్యాఖ్యానించారు. సైదిరెడ్డి ఏజెంట్ బూతులో కూర్చుంటే…. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏజెంట్ కూర్చునే పరిస్థితి లేదన్నారు. నేను ఏడవ తరగతి లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఊర్లోకి రానివ్వలేదని, హత్య కేసులు పెట్టి వేధించిన వెనక్కి తగ్గలేదన్నారు శానంపూడి సైదిరెడ్డి. అంతేకాకుండా.. మంచినీ పక్కన పెడితే… నేను ఏం చేయగలనో అందరికీ తెలుసునని శానంపూడి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు ఏ రాజకీయం చేసి వదిలిపెట్టానో మళ్ళీ అది మొదలు పెడతానని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విడిచి వెళ్లిన వారికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అది ఇస్తానని, పార్టీలో ఉండి సంపాదించింది అంతా వడ్డీతో సహా వసూళ్లు చేస్తానన్నారు శానంపూడి సైదిరెడ్డి.

Also Read : Balakrishna : బాలయ్యతో సుకుమార్ సినిమా..? పుష్పను మించిన స్టోరీనా..

అంతేకాకుండా.. నియోజకవర్గం మొత్తం గ్రామపంచాయతీ సర్పంచ్ లు 140గాను మనం 105 గెలిచినం అన్నారు. ఎంపీటీసీలు 72గాను మనం 55 గెలిచినం, నియోజకవర్గ వ్యాప్తంగా చాలా బలంగా మంచిగా ఉన్నామని 80 శాతం మంది మన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని ఇలాగే బాధ్యతగా పని చేస్తానని, మీ ప్రేమను, అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 40ఏండ్లలో చేసిన అభివృద్ధిని నాలుగేండ్లలో చేసి చూపించామని పేర్కొన్నారు. కార్లలో డబ్బులు తగులబెట్టిన చరిత్ర ఉత్తమ్‌దని విమర్శించారు. దళిత బంధు, రైతు బంధు పథకాలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెసోళ్లు ఎలాగైనా అధికారంలోకి వచ్చి అడ్డంగా సంపాదించాలని చూస్తున్నారన్నారు.

Also Read : Kangana Raunat : స్టార్ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా..