Site icon NTV Telugu

Shalini Ajith : తన సినిమాలను పిల్లలు చూడకపోవడంపై..షాలినీ అజిత్ కుమార్ వైరల్ కామెంట్స్!

Shalini

Shalini

ఒకప్పుడు తన క్యూట్ యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి షాలినీ అజిత్ కుమార్. ‘సఖి’ (అలైపాయుతే), ‘ప్రేమమ్’ (మలయాళం), ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (బేబీ షాలినీగా) వంటి చిత్రాలతో ఆమె ఒక వెలుగు వెలిగారు. అజిత్ కుమార్‌ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైన షాలినీ, తాజాగా ఒక అవార్డుల వేడుకలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

Also Read : Jai Hanuman : అంజనాద్రి సాక్షిగా ‘జై హనుమాన్’ షురూ.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి ఎంట్రీ..!

తాజాగా జరిగిన జేఎఫ్‌డబ్ల్యూ (JFW) మూవీ అవార్డ్స్ 2026 వేడుకలో షాలినీ మాట్లాడుతూ, తన పిల్లలు అనౌష్క, ఆద్విక్ ఇప్పటివరకు తన సినిమాలను ఒక్కటి కూడా పూర్తిగా చూడలేదని వెల్లడించారు.. ‘నేను ఈ వేదికను ఒక అవకాశంగా తీసుకుని నా పిల్లలకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్.. నా సినిమాలు కనీసం ఒక్కటైనా చూడండి’ అంటూ ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తన కూతురు అనౌష్క గురించి ఒక సరదా విషయాన్ని గుర్తు చేసుకున్నారు.. ‘రీసెంట్‌గా నా కూతురు తన ఫ్రెండ్స్ దగ్గర నా సినిమా ‘సఖి’ (Alaipayuthey) గురించి విని, అది నాతో కలిసి చూడాలని అడిగింది. నేను కూడా చాలా సంతోషపడ్డాను, కానీ ఆ ప్లాన్ ఇప్పటివరకు అమలు కాలేదు. వాళ్ళు కేవలం నా సినిమాల్లోని పాటలు మాత్రమే వింటారు తప్ప, సినిమాలను మాత్రం ఎప్పుడూ చూడమని వాయిదా వేస్తుంటారు’ అని షాలినీ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ అజిత్ ఫ్యామిలీలో సినిమాలు ఎంత తక్కువగా డిస్కస్ చేస్తారో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version