NTV Telugu Site icon

Shakibal Hasan: చెక్ బౌన్స్ కేసులో స్టార్ ఆల్ రౌండర్‭కు అరెస్ట్ వారెంట్ జారీ

Shakibal Hasan

Shakibal Hasan

Shakibal Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ మధ్య కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 2024లో ఇంగ్లండ్‌లో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో షకీబ్ బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉన్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటన తరువాత ఆయనపై నిషేధం విధించబడింది. బౌలింగ్ యాక్షన్ టెస్టుల్లో ఇప్పటికే రెండుసార్లు విఫలమైన షకీబ్‌కి ఇది పెద్ద దెబ్బగా మారింది. దీనితో, బంగ్లాదేశ్ జట్టులో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయాడు. ఇది ఇలా ఉండగా.. షకీబ్‌కి మరొక పెద్ద దెబ్బ తగిలింది. ఐఎఫ్‌ఐసి బ్యాంక్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో షకీబ్‌ పై ఢాకాలోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Also Read: INDW vs WIW: భారత బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్ బ్యాటర్లు విలవిల.. 44 పరుగులకే ఆలౌట్

ఢాకా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జియాదుర్ రెహమాన్ ఆదివారం షకీబ్‌ అల్ హసన్‌తో పాటు మరో ముగ్గురిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసు ఐఎఫ్‌ఐసి బ్యాంక్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ షాహిబుర్ రెహమాన్ దాఖలు చేయగా, రెండు చెక్కుల ద్వారా సుమారు 41.4 మిలియన్ టాకా అంటే సుమారుగా భారత కరెన్సీలో 3 కోట్ల భారతీయ రూపాయలు చెల్లించాల్సి ఉన్నా.. షకీబ్‌ చెల్లిచడంలో విఫలం కావడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. షకీబ్‌ సంస్థ “అల్ హసన్ ఆగ్రో ఫామ్ లిమిటెడ్” ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కంపెనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఘాజీ షాగీర్ హుస్సేన్, డైరెక్టర్లు ఇమ్దాదుల్ హక్, మలైకర్ బేగం పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి.

Also Read: Atishi Marlena: కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై దాడి వారి పనే.. ముఖ్యమంత్రి అతిశీ ఫైర్

ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న షకీబ్‌ బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి నిరాకరించారు. దేశంలో జరుగుతున్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన సమస్యలు, ఇంకా చట్టప్రక్రియల కారణంగా దేశంలోకి తిరిగి రాకుండా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం షకీబ్‌ కుటుంబం అమెరికాలో స్థిరపడగా.. ఆయన బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు.