NTV Telugu Site icon

ShahRukhKhan: షారూఖ్‌ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. డిశ్చార్జ్!

Seke

Seke

బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో డీహైడ్రేషన్‌కు గురి కావడంతో కేడీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో షారూఖ్‌ఖాన్‌ను వైద్యులు పరీక్షించాక డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితిపై మాత్రం కేడీ ఆస్పత్రి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: RR vs RCB: తడబడి తేరుకున్న ఆర్సీబీ.. ఆర్ఆర్ టార్గెట్ 173..

షారూఖ్‌ఖాన్ ఆస్పత్రిలో చేరారని వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ప్రార్థించారు.

మంగళవారం అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అహ్మదాబాద్ స్టేడియంలో షారూఖ్ సందడి చేశారు. చాలా ఉత్సాహంగా కనిపించారు. తన పిల్లలతో కలిసి సంబరాలు కూడా చేసుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ గెలిచాక జట్టు ఆటగాళ్లను కౌగిలించుకున్నారు. బుగ్గలపై ముద్దులు కూడా పెట్టారు.

ఇది కూడా చదవండి: Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..