ఆసియా కప్ -2023 నిర్వహణ వివాదం ఇంకా సద్దుమణగలేదు.. ఈ ఏడాది ఆసియాకప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే భారత్- పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల మధ్య పాకిస్తాన్ లో పర్యటించడానికి బీసీసీఐ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియాకప్ ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ను బీసీసీఐ సూచించింది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆసియా కప్ ను తమ దేశంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్ లను యూఏఈ వేదికగా నిర్వహించాలని, మిగితా మ్యాచ్ లను పాక్ లోనే జరపాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
Also Read : Pathaan: హోల్డ్ టైట్… పఠాన్ వస్తున్నాడు…
ఇక ఈ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యల చేశాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే క్రికెట్ ఒక్కటే మార్గమని ఆఫ్రిది స్పష్టం చేశాడు. అదే విధంగా ఈ విషయం గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను త్వరలోనే మాట్లాడుతానని షాహిది ఆఫ్రిది చెప్పాడు. భారత్-పాక్ ల మధ్య సంబంధాలు బాగుపడాలంటే అది కేవలం ఒక క్రికెట్ వల్లే ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్ లు, ఇతర టోర్నీలు జరగాలని ఆయన సూచించారు. రెండు దేశాల మధ్య క్రికెట్ జరగాలని నేను మోడీ సార్నే అభ్యర్థిస్తాను అంటూ ఆఫ్రిది కామెంట్స్ చేశాడు. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నా.. వారు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయగలము.. బీసీసీఐ చాలా బలమౌన క్రికెట్ బోర్డు అనడంలో ఎలాంటి సందేహం లేదని షాహిద్ ఆఫ్రిద్ అన్నారు.
Also Read : Spa Center : స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్
కానీ మనం పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు.. బాధ్యత కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు మిత్రులను పెంచుకోవాలి తప్ప శత్రువులను కాదు అంటూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది అన్నారు. మీకు సంభందాలు ఎంత ఎక్కువగా ఉంటే మరింత బలపడతారు.. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బలహీనంగా ఏమీ లేదు.. ప్రపంచ క్రికెట్ లో పాకిస్తాన్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆఫ్రిది అన్నారు. ఆస్ట్రేలియా. ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్లు కూడా పాకిస్తాన్ వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. ఇక భాతర జట్టులో నాకు ఇప్పటికీ స్నేహితులు ఉన్నారు. మేము కలిసినప్పుడు అన్ని విషయాల గురించి చర్చించుకుంటాం.. లెజెండ్స్ లీగ్ సందర్భంగా రైనాను కలిశాను.. అతడి బ్యాట్ తో ఓ మ్యాచ్ కూడా నేను ఆడాను అంటూ షాహిది ఆఫ్రిది అన్నారు.