బాలీవుడ్ బాద్‌షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జవాన్, పఠాన్ వంటి బ్యాక్ టు బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసాడు. కానీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో చేసిన డంకి నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. జవాన్ సినిమాకు గాను ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు షారుక్. అయితే నవంబర్ 2 షారుక్ ఫ్యాన్స్ కు స్పెషల్ డే. ఈ రోజు షారుక్ బర్త్ డే. కింగ్ ఖాన్ బర్త్ డేను ఆయన ఫ్యాన్స్ గ్రాండ్ గా చేసుకుంటారు. ఈసారి మాత్రం ఫ్యాన్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు జేస్తూ వారికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు షారుక్.
షారుక్ ప్రస్తుతం సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ రోజు షారుక్ బర్త్ డే కానుకగా ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు ‘కింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక కింగ్ టీజర్ విషయానికి వస్తే’ నేను ఎంతమందిని చంపానో గుర్తు లేదు. వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ల అవేవి నాకు కాదు వాళ్ళ కళ్ళల్లో భయం మాత్రమే నాకు గుర్తుంది. అదే వారి చివరి శ్వాస. అందుకు కారణం నేనే. వేల సంఖ్యలో హత్యలు, చాలా కంట్రీస్ కు మోస్ట్ వాంటెడ్ అయిన నాకు ఈ ప్రపంచం ఒక పేరు ఇచ్చింది అదే ‘ KING’ అని రిలీజ్ చేసిన టీజర్ కు భారీ స్పందన లభిస్తోంది.