NTV Telugu Site icon

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. Y+ భద్రత కల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Sharukh

Sharukh

Shah Rukh Khan: ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ హీరో షారుక్ ఖాన్. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు పఠాన్, జవాన్ లతో వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇది ఇలా ఉంటే షారూఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. కింగ్ ఖాన్‌కు ముప్పు పొంచి ఉన్నందున.. ముంబై పోలీసులు అతడికి Y+ భద్రతను కల్పించారు. ముంబై పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం.. షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల తర్వాత తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. దీని తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు Y+ భద్రతను పెంచింది.

Read Also:Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదం.. 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు

షారుక్ ఖాన్‌కు ముంబై పోలీసులు అందించిన Y+ భద్రతలో 6 వ్యక్తిగత భద్రతా అధికారులు, 5 ఆయుధాలు అతనితో 24 గంటలు ఉంటాయి. నిజానికి షారుఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు నిఘా వర్గాల సమాచారం అందింది. ఇటీవల పఠాన్, జవాన్ చిత్రాల హిట్ తర్వాత షారుక్ అండర్ వరల్డ్, గ్యాంగ్ స్టర్స్ టార్గెట్ గా ఉన్నాడు. ఇంతకు ముందు ఇద్దరు పోలీసులు మాత్రమే ఆయన భద్రతలో ఉండేవారు. కింగ్ ఖాన్‌కి ఇచ్చిన Y+ సెక్యూరిటీ ఖర్చులను షారుఖ్ ఖాన్ స్వయంగా భరిస్తాడు. దీన్ని నటుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

Read Also:Drohi Movie: నేషనల్‌ సినిమా డే రోజున ద్రోహి రిలీజ్.. ₹112 కే టికెట్లు!

Show comments