Site icon NTV Telugu

Jawan: వివాదాల్లో షారూఖ్ ఖాన్.. కథ కాపీ అంటున్న నిర్మాత

Jawan

Jawan

Jawan: కింగ్ ఖాన్ షారూఖ్ వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా చిక్కుల్లో పడింది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఓ సినిమా చేస్తున్నారు. దీనికి జవాన్ అని టైటిల్ కూడా ఎనౌన్స్ చేసింది చిత్ర బృందం. నయతతార తొలిసారి షారూఖ్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న జవాన్ చిత్రం ఇప్పుడు వివాదాలకు కారణమైంది. దర్శకుడు అట్లీ జవాన్ కథను కాపీ కొట్టాడంటూ మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత కోలీవుడ్ నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేయడం ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

Read Also: Kajal Aggarwal Shocking Decision : సినిమాల కోసం కాజల్ షాకింగ్ డెసిషన్

కారణం హీరో ఒక్కడే బాలీవుడ్. మిగతా టీం అంతా అంటే డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అంతా కోలివుడ్ వాళ్లే. దాంతో జవాన్ హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. అయితే అట్లీ ఈ కథణు 2006లో విజయ్ కాంత్ హీరోగా వచ్చిన పేరరసు చిత్ర కథను కాపీ కొట్టాడని… దీనిపై కాపీ రైట్ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకోవాలంటూ మాణిక్యం నారాయణన్ అనే కోలీవుడ్ నిర్మాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై అట్లీ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Exit mobile version