Site icon NTV Telugu

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా

Srk

Srk

Shah Rukh Khan: బీ టౌన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ బర్త్ డే వచ్చిందంటే ఆయన అభిమానులకు పండుగే పండుగ. నవంబర్ రెండో తేది ఆయన పుట్టిన రోజు రాగానే షారూఖ్ ఇంటివద్దకు అభిమానులు చేరుకుని ఆయకు విషెష్ చెబుతుంటారు. ఆ రోజు ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ దేశనలుమూలల నుంచి షారూఖ్ నివాసానికి చేరుకుంటారు. బుధవారం ఆయన 57వ పుట్టిన రోజు సందర్భంగా ఈసారి మంగళవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు ఆయన ఇంటి వద్ద బారులు తీరారు. తెల్లవారుజాములోపే మన్నత్ పరిసర ప్రాంతమంతా జనసంద్రమైంది. అభిమానులు బాణాసంచా కాలుస్తూ, కేరింతలతో తమ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

Read Also: Trivikram: బర్త్ డే సందర్భంగా ‘నువ్వే నువ్వే’ అంటున్న ఆయన అభిమానులు

వారి అభిమానాన్ని చూసేందుకు షారుఖ్ బయటకు వచ్చారు. తన చిన్న కొడుకు అబ్ రామ్ తో మన్నత్ బాల్కనీలోకి వచ్చిన ఆయన.. ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. చేయి ఊపుతూ, నమస్కారం చెబుతూ వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన సిగ్నేచర్ స్టయిల్ లో ఫోజు ఇచ్చి వారిని ఉత్సాహపరిచారు. బాల్కనీ నుంచి సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఇక షారుఖ్ ను చూసిన వెంటనే అక్కడి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. షారుఖ్ చివరగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఆయన తదుపరి చిత్రం ‘పఠాన్’ వచ్చే జనవరి 25న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునె హీరోయిన్ గా నటిస్తున్నారు.

Exit mobile version