Site icon NTV Telugu

Shah Rukh Khan: బిలియనీర్ల క్లబ్‌లోకి షారుఖ్ ఖాన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా!

Shah Rukh Khan

Shah Rukh Khan

Shah Rukh Khan: బాలీవుడ్‌లో “కింగ్ ఖాన్” గా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో షారుఖ్ ఖాన్. ఈ హీరో ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజున ఆయనకు 60 ఏళ్లు నిండుతాయి. దీంతో పాటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఆయన బిలియనీర్ల క్లబ్‌లో చేరాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన షారుఖ్ ఖాన్ తన సినీ ప్రయాణంలో బుల్లి తెర నుంచి బాలీవుడ్ రారాజు స్థాయికి ఎదిగారు. తాజాగా ఆయన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 జాబితాలోకి ఎక్కారు. ఈ స్టోరీలో షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం.

READ ALSO: Jogi Ramesh: నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ ను విచారిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.!

షారుఖ్ ఖాన్‌కు 60 ఏళ్లు..
షారుఖ్ ఖాన్‌ కేవలం ఒక హీరో మాత్రమే కాదు. ఆయనో బిలియనీర్. ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమా అయినా లేదా ‘దిల్ తో పాగల్ హై’, ‘కరణ్ అర్జున్’, ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి ఎవర్‌గ్రీన్ సినిమాలు, ‘పఠాన్’, ‘జవాన్’ వంటి యాక్షన్ సినిమాలతో బాలీవుడ్‌లో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి షారుఖ్ ఖాన్. షారుఖ్ 1965 నవంబర్ 2న జన్మించాడు. ఈ ఆదివారం రోజు ఆయన 60 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

భారతదేశంలో ధనవంతుల సంఖ్య ఏడది కాలంగా పెరుగుతోంది. ఈ జాబితాలో నిరంతరం కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. ఈ జాబితాలో కేవలం వ్యాపారులు మాత్రమే కాకుండా క్రీడాకారులు, హీరోలు కూడా వచ్చి చేరుతున్నారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఇటీవల విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 జాబితాలో తొలిసారిగా బిలియనీర్‌గా పేరు సంపాదించారు. ఆయన రూ. 12,490 కోట్ల నికర విలువతో (షారుఖ్ ఖాన్ నెట్‌వర్త్) బిలియనీర్ల క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు. షారుఖ్ ఖాన్ తన నికర విలువలో ఎక్కువ భాగాన్ని నటన ద్వారానే పొందుతున్నాడు. నిర్మాణం నుంచి ఎండార్స్‌మెంట్‌ల వరకు ప్రతిదానిలోనూ ఆయన ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఆయన సంపద గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 71% పెరిగింది. ఆయన భార్య గౌరీ ఖాన్ ఆధ్వర్యంలో స్థాపించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆదాయం కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ FY23లో రూ.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ కూడా ఈ సంస్థ సంపదను గణనీయంగా పెంచింది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.640.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,160 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ అత్యధిక సంపద కలిగిన నటుడిగానే కాకుండా, అత్యధిక పన్నులు చెల్లించే నటుల జాబితాలో కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. గత ఏడాది ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.92 కోట్ల పన్నులు చెల్లించి, అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచాడు.

READ ALSO: Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు..

Exit mobile version