NTV Telugu Site icon

Blast Incident: షాద్నగర్ పేలుడు ఘటన.. విషమంగా ముగ్గురి పరిస్థితి

Shad Nagar

Shad Nagar

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.. సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరోవైపు.. గాయపడ్డ 15 మంది కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశా, బీహార్, యూపీ నుంచి వచ్చిన కార్మికులు ఈ కంపెనీలో ఎక్కువగా పని చేస్తున్నారు. మృతులంతా బీహార్, ఒడిశా, యూపీ వాసులే. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. పేలుడు ధాటికి కంపెనీకి చెందిన షెడ్ కుప్పకూలింది. ప్రమాద స్థల దృశ్యాలు కంటతడి పెట్టించాయి. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.

Read Also: AP CM: పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ..

పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు చనిపోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాద సమయంలో కంపెనీలో 150 మంది కార్మికులు ఉన్నారు. కంప్రెషర్ పేలుడు తీవ్రతకు గ్లాసు ముక్కలు కావడంతో ఎక్కువ మందికి గుచ్చుకున్నాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారికి మెరుగై చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డ ఆదేశించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ కంప్రెషర్ పేలుడు, కార్మికుల మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులపై కేసు నమోదు చేశామన్న షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి.. పేలుడు సమయంలో విధుల్లో ఉన్న మేనేజర్, సెక్షన్ ఇంఛార్జ్ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Read Also: Delhi Rains : ఢిల్లీలో కుండపోత వాన.. ఎయిమ్స్‌లో మూడపడిన ఆపరేషన్ థియేటర్లు