Shadab Khan: ఏంటి బాబాయ్ పక్షిలా ఎగిరి పట్టావ్ ఆ క్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఇవాళ( మంగళవారం) జరుగుతున్న తొలి వన్డేలో పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యం.. కానీ స్టైల్ లో షాదాబ్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్ సారథి హస్మతుల్లా షాహీది క్యాచ్‌ను అందుకున్నాడు. షాహీది పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డగౌట్ కు చేరుకున్నాడు. షాదాబ్ పక్షిలా గాల్లోకి ఎగురూతూ ఎడమ చేత్తో అందుకున్నాడు. ఈ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
Read Also: Tillu Square: ఏం .. రాధికా.. ఇంకా మా టిల్లుగాడిని వదలవా.. ?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అయితే, అంతకు ముందు ఓవర్లోనే షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఆఫ్ఘనిస్తాన్ వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘన్ తమ కెప్టెన్ వికెట్ కోల్పోవడంతో మరింత కష్టాల్లో పడింది. ఆ జట్టు 3.3 ఓవర్లలో కేవలం 4 రన్స్ మాత్రమే చేసి కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. 3వ ఓవర్ 4, 5 బంతులకు షాహీన్ అఫ్రిది.. ఇబ్రహీం జద్రాన్, రెహ్మత్ షాలను డకౌట్ చేసి పెవిలియన్ కు పంపగా.. 4వ ఓవర్ మూడో బంతికి నసీం షా.. ఆఫ్ఘన్ సారథిని డగౌడ్ కి పంపాడు.
Read Also: Hansika Motwani: పెళ్ళైనా ఎక్కడా తగ్గని హన్సికా అందాల విందు.. వైట్ డ్రెస్సులో మెరుస్తోందిగా!
అనంతరం 8వ ఓవర్ మొదటి బంతికి, 14వ ఓవర్ మూడో బంతికి హరీస్ రౌఫ్.. ఇక్రమ్ అలీఖిల్ , గుర్భాజ్ లను అవుట్ చేయడంతో ఆఫ్ఘన్ జట్టు కేవలం 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోత్తు కష్టాల్లో పడింది. 15 ఓవర్లు ముగిశాక ఆ జట్టు స్కోర్ 47/5గా నిలిచింది. ఒమర్జాయ్ (10), నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఇక, అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. ఇమామ్ ఉల్ హాక్ , షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ ఓ మోస్తరుగా రాణించడంతో 47.1 ఓవర్లలో 201 రన్స్ చేసి ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడు వికెట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్ రెండు, మహ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టగా, రెహ్మత్ షా, ఫజల్ హక్ ఫారూకీ తలో వికెట్ తీసుకున్నారు.
WHAT A CATCH BY SHADAB…!!!
The best fielder from Pakistan in this generation.pic.twitter.com/QJAcIlZnLk
— Johns. (@CricCrazyJohns) August 22, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!