కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులారా కలిసి మాట్లాడుకుందాం రండి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండరాం సర్ జేఎసీ చైర్మన్ గా ఉంటేనే తెలంగాణ వచ్చింది అని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో ఉండడమే తప్ప ప్రజలని కలిసి కష్టాలను తెలుసుకునే అలవాటు లేదు అని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రోజు 3, 4 వందల మందిని కలిసి వారి సమస్యలని తెలుసుకున్నాడు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Read Also: AP BJP: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇలా స్పందించిన ఏపీ బీజేపీ
ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ లో తెలంగాణ ద్రోహులు ఉన్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. 1969లో మొదటి సారిగా తెలంగాణ రావాలని ఆత్మబలిదానం చేసుకున్న గడ్డ కామారెడ్డి అని ఆయన చెప్పారు. కామారెడ్డికి వచ్చి ముఖ్యమంత్రి కేసిఆర్ చేసింది ఏమీ లేదు.. కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామ ప్రజలు ఆయనను ఛీఛీ అంటున్నారు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారం అయినది తప్ప.. తెలంగాణ మాత్రం బంగారు తెలంగాణ కాలేదు అంటూ విమర్శించారు.
Read Also: Alia Bhatt : సినిమాలకు బ్రేక్ తీసుకున్న అలియా.. రోజూ ఏం చేస్తుందో చూశారా?
అందరం ఐక్యతతో పోరాడి సీఎం కేసిఆర్ ని గద్దే దించాలి అని షబ్బీర్ అలీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో ఏ ఒక్క కార్మికులు కూడా రోడ్డేక్కి ధర్నాలు చేయలేదు అని ఆయన తెలిపారు. కేసిఆర్ కామారెడ్డికి వచ్చెది భూములని అమ్మడానికే.. కేటిఆర్ నర్మాల డ్యాం దగ్గర 400 ఎకరాలని కబ్జా చేశాడు.. తెలంగాణని రక్షించుకోవాడం కోసం ప్రతి ఒక్కరం చేతులు కలిపి పోరాడుదామన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అమెరికాలో బాత్ రూంలని కడిగినాడు అని ఆయన విమర్శించారు. గోదావరి జలాలని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కేసిఆర్ ని బోంద పెట్టడం ఖాయం అని షబ్బీర్ అలీ వెల్లడించారు.