NTV Telugu Site icon

Shabbir Ali: కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుంది

Shabbir Ali

Shabbir Ali

కామారెడ్డిలో నియోజకవర్గ కాంగ్రెస్ అనుబంధ సంస్థల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ సమన్వయ కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములను అమ్ముకోవడాని కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని.. ఆ పార్టీని భూస్థాపితం చేద్దామని అన్నారు.

Read Also: Chandrayaan-3: జాబిల్లి ఉపరితలంపై అడుగుపెట్టిన రోవర్‌.. వీడియో విడుదల చేసిన ఇస్రో

హైదరాబాద్, గజ్వేల్ లో రింగ్ రోడ్డు పేరుతో భూములు అమ్ముకుని.. ఇప్పుడు కామారెడ్డి చుట్టుపక్కల విలువైన భూములు అమ్మేందుకు కేసీఆర్ వస్తున్నారని షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకమే కేసీఆర్ చేసిన అభివృద్ధి అని విమర్శించారు. అంతేకాకుండా.. కమీషన్లు దండుకుని నాణ్యత లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Read Also: Iran: కుక్కకు ఆస్తి రాయించి జైలు పాలయ్యాడు

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచుతామని.. కేసీఆర్ ను జైలుకు పంపుతామన్నారు. కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదని.. సోనియా గాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ కళ సాకారమైందని షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డిలో కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్ సైనికులకు మధ్య యుద్ధం జరుగుతుందని.. కామారెడ్డిలో కౌరవ- పాండవుల యుద్ధం జరగబోతుంది, కౌరవులను ఓడించాలన్నారు. అంతేకాకుండా.. మార్పు కావాలంటే కేసీఆర్ ను ఓడించాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.