NTV Telugu Site icon

Shabbir Ali: కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు పెద్ద సినిమా చూపిస్తారు

Ali

Ali

కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ ఆకాశం లాంటిది.. ఆకాశంపై ఉమ్మితే మీపైనే పడుతుంది అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పేరు దుబాయ్ కేసీఆర్.. దుబాయ్ ఏజెంట్ కొడుకు నా పై మాట్లాడటం విడ్డురంగా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బు తో 4 హెలికాప్టర్ లల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.. హెలికాప్టర్ లలో తిరగడానికి డబ్బులు ఎక్కడివి?.. ఈ అంశం పై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తాం.. మిగతా మంత్రులకు హెలికాప్టర్లు ఎందుకు ఇవ్వడం లేదు అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఊసర వెళ్లిలా డబుల్ గేమ్ అడుతారు.. 2004 ఎన్నికల్లో కేసీఆర్ నన్ను ఓడించాలని చూసారు అని షబ్బీర్ అలీ ఆరోపించారు.

Read Also: Animal : రశ్మికతో రణబీర్.. మోస్ట్ వయిలెంట్ ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారట!

మంత్రి కేటీఆర్ కు చరిత్ర తెలియదు అని షబ్బీర్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ కంటే 9 ఏళ్ల ముందు మంత్రి అయ్యాను.. నాపై ఒక్క అవినీతి ఆరోపణలు లేవు.. అది షబ్బీర్ అలీ అంటే.. కేసీఆర్, కేటీఆర్ పై ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల కుటుంబం అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ఆఫీస్ లోనే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు అని అన్నారు. దళిత బంధుకు 3 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు.. దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణను అమ్ముకోమని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు.. కార్యకర్తలు లూటీ చేస్తున్నారు అంటూ షబ్బీర్ అలీ మండిపడ్డారు.

Read Also: Rahul Gandhi: నవయుగ రావణ్‌ రాహుల్.. బీజేపీ పోస్ట్‌ వైరల్, కోర్టుకెళ్లిన కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ 80 సీట్లకు పైగా గెలుస్తుంది అని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. పోలీసులపై చేయి చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి.. బీఆర్ఎస్ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. ప్రశ్నిస్తే ప్రల పై దాడికి పాల్పడుతున్నారు.. టికెట్లు ఫైనల్ కాలేదు.. అమ్ముకుంటున్నారంటే ఎలా?.. నాకు రేవంత్ రెడ్డికే ఇంకా టికెట్లు ఫైనల్ కాలేదు అని తెలిపారు. తెలంగాణలో ఎక్కడ 24 గంటల కరెంట్ వస్తుందో నిరూపించు అని కేటీఆర్ కు షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. సిరిసిల్లకు నేనే వస్త 24 గంటల కరెంట్ రావడం లేదని నిరూపిస్తా.. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్.. కామారెడ్డి ప్రాంతంలో సీఎం ఒక దుబాయి కేసీఆర్.. తక్కువ దూరంలో హెలి క్యా పిటర్ లో తిరగడానికి ఎలా అనుమతి ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు.

Read Also: ICC World cup 2023: ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ గెలుపు.. మెరిసిన షకీబ్, హసన్

కామారెడ్డి సభలో మంత్రి కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ ది డబుల్ గేమ్.. కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ ప్రాజెక్టులు.. కేసీఆర్ కుటుంబంలో అందరిపై కేసులున్నాయి.. అవినీతికి మారుపేరు కల్వకుంట్ల కుటుంబం అని ఆయన ఆరోపించారు. నా పై ఒక్క పిటి కేసు కూడా లేదు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి ప్రజలు సీఎం కేసీఆర్ కు పెద్ద సినిమా చూపిస్తారు.. కేసీఆర్ ను ఓడించి పంపిస్తాం అంటూ షబ్బీర్ అలీ తెలిపారు.