NTV Telugu Site icon

Shabbir Ali : టీఎస్పీఎస్సీ లీక్‌ కేసులో సిట్ దర్యాప్తు శూన్యం

Shabbir Ali Letter To Cm

Shabbir Ali Letter To Cm

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు వ్యవహారాన్ని సీబీఐతో కానీ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ. ఇవాళ ఆయన కామారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్ ద్వారా దర్యాప్తు చేస్తే ఫలితం శూన్యమన్నారు. పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి హస్తం ఉందని ఆరోపించారు షబ్బీర్‌ అలీ. గత ప్రభుత్వాలు సిట్ ద్వారా దర్యాప్తు చేస్తే ఫలితాలు శూన్యంగా వచ్చాయని దానికి ఉదాహరణ భూ మాఫియా డాన్ నయీం కేసు అని ఆయన అన్నారు. నిరుద్యోగ యువతతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు షబ్బీర్‌ అలీ. పేపర్ లీకేజీ అయినప్పటికీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గం టేక్ ఇట్ ఈజీగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు షబ్బీర్‌ అలీ.

Also Read : Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌పై ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కొందరు నేతలు పాల్గొనకుండా శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో గృహనిర్బంధం చేశారు పోలీసులు. ఓయూలోని వివిధ విద్యార్థులు, నిరుద్యోగ యువజన సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ప్రస్తుత టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును నియమించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులపాటు నిరసనకు జేఏసీ పిలుపునిచ్చింది.

Also Read : Cigarette Crime: సిగరెట్ పెట్టిన చిచ్చు.. అన్యాయంగా ఒకరు మృతి