NTV Telugu Site icon

Shabbir Ali : మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం

Shabbir Ali

Shabbir Ali

కామారెడ్డి క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ సన్మాన సభ. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. ఎంపీగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సురేష్ షెట్కార్‌ను షబ్బీర్‌ అలీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆడవాళ్ళకు బ్రేక్ డాన్స్ చేయిస్తా అన్న వారికి బుద్ధి చెబుతామన్నారు. మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. 200 యూనిట్స్ కరెంటు కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయి..దానిని టీఆర్ఎస్ వాళ్ళు పెద్దగా చేస్తున్నారని, అధికారులు సరి చేస్తున్నారన్నారు షబ్బీర్‌ అలీ. రుణమాఫీ కొందరికి అందలేదు…అందరికీ మాఫీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో రుణమాఫీ కోసం 6 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు షబ్బీఆర్‌ అలీ. అందరికీ మాఫీ అయ్యేలా కమిటీని వేస్తున్నామని ఆయన తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రుణమాఫీ గురించి మాట్లాడని కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పుడు ఇష్టమచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు, చేశాము ఏమాయే రాజీనామా అని ఆయన వ్యాఖ్యానించారు.

Tragedy: విషాదం.. హంసలదీవి బీచ్‌లో ఇద్దరు పర్యాటకులు గల్లంతు

అంతేకాకుండా.. ‘రుణమాఫీ పూర్తి అవ్వగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తాము. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు, 3 విడుతల్లో 5 లక్షల్లో ఇస్తాము. గరీబొల్ల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డిలో రమణారెడ్డి ముఖ్య మంత్రుల పై గెలిచినను అని చెప్పుకుంటున్నావ్, కామారెడ్డి ని 150 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నావ్ ఏమాయే, నికే వదిలేస్తున్నం. ప్రభుత్వం నుండి ఫండ్ వచ్చింది చేద్దాం అని పోతే ఆయన ఎవరు అంటాడు. పోనీ ఎంఎల్ఏ చేస్తాడా అంటే చెయ్యడు. దేవుడు అవకాశం ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, కామారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం.’ అని షబ్బీర్‌ అన్నారు. సురేష్ షెట్కర్ మాట్లాడుతూ.. ‘పెద్ద మనసుతో ఆదరించి గెలిపించినందుకు కామారెడ్డి ప్రజల రుణం తీర్చుకుంటా. షబ్బీర్ అలీ సహకారంతో కామారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది.’ అని ఆయన అన్నారు.

Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార నిందితుడికి సీబీఐ “సైకలాజికల్ టెస్ట్‌లు” ..