కామారెడ్డి జిల్లా రామా రెడ్డి మండలం అన్నారం లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పర్యటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో చేరారు గ్రామస్థులు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తాను 2 సార్లు గెలిచా.. కానీ 2 తరాలకు అవసరమైమ అభివృద్ధి చేసానన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశానని ఆయన వ్యాఖ్యానించారు. 15 ఏళ్ళల్లో కామారెడ్డి అభివృద్ధి వెనుకబడిందని, పార్టీలు జంప్ లు చేసే నాయకులు దున్నపోతులుగా ఆయన అభివర్ణించారు. మిగులు రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, బీఆర్ఎస్ నేతలు గుడిలను కూడా మింగేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Ind vs WI: ఏందయ్యా.. మీరు ఇప్పుడైనా ఫామ్ లోకి రండి..
తెలంగాణ దొరల చేతుల బందీ అయిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సాగులో ఉన్న గిరిజనులందరికి పోడు భూములకు పట్టాలిస్తామన్నారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని తాను నిరూపిస్తామన్నారు. గంప గోవర్ధన్ ను 3 సార్లు గెలిపించారు.. నన్ను ఈ ఒక్క సారి గెలిపించండని ఆయన అన్నారు. కేసీఆర్ మరోసారి గెలిస్తే పేదల భూములు మాయం చేస్తాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని ఆకాంక్షిస్తున్నారని, కర్ణాటక ప్రజలు బీజేపీ, జేడీ(ఎస్)లను తిరస్కరించినట్లే తెలంగాణలోని ఓటర్లు బీఆర్‌ఎస్, బీజేపీ విభజన రాజకీయాలను తిరస్కరిస్తారన్న విశ్వాసం తమకు ఉందన్నారు.
Also Read : Health News: జర్వం వచ్చినప్పుడు బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా?