Site icon NTV Telugu

Supreme Court: ఆ ఎమ్మెల్యే ప్రొఫైల్‌తో యువతులకు ఎర.. షాదీ డాట్ కామ్‌పై సుప్రీంకోర్టు ఫైర్

Supreme Court

Supreme Court

Supreme Court: షాదీ డాట్ కామ్‌కు సంబంధించిన అనేక మోసాలు తరచూ వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “షాదీ డాట్ కామ్”తో సైబర్ నేరాలకు మార్గం సులువుగా మారిందని కోర్టు పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే..

READ MORE: Dhurandhar OTT Responce : నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్

రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన చెరుకూరి హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణ అనే వ్యక్తి షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో యానాం ఎమ్మెల్యే ఫొటోతో ప్రొఫైల్ సృష్టించి, పెళ్లి కాని యువతులను మోసం చేశాడు. ఆ ప్రొఫైల్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఒక వైద్యురాలు చూసి కాంటాక్ట్ చేసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐటీ శాఖ తన బ్యాంకు ఖాతాలను జప్తు చేసిందని చెప్పి రూ.11 లక్షలు దోచేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇదే తరహాలో ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో తమను మోసం చేసినట్లు నిందితుడి మీద పలువురు యువతులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితుడితో పాటు, షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీష్‌ల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో వీళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారిస్తూ షాదీ డాట్ కామ్ సైబర్ నేరగాళ్లకు మార్గాన్ని సులువుగా చేసిందని, అందుకే మీ మీద కేసు నమోదు చేశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫైర్ అయ్యారు. ఈ కేసు గురించి తెలంగాణ హైకోర్టు పునఃసమీక్షించుకుని, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.

READ MORE: MS Dhoni: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?.. MS ధోనీ సంచలన వ్యాఖ్యలు
https://www.yoursite.com/

Exit mobile version