Site icon NTV Telugu

Explosion: చర్లపల్లిలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు

Charlapally

Charlapally

Under Ground Drainage: చర్లపల్లి లో భారీ పేలుడు సంభవించింది. వెంకట్ రెడ్డి నగర్ & మధుసూదన్ రెడ్డి నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో నిన్న రాత్రి భారీ శబ్దంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో పేలుడు చోటు చేసుకుంది. అయితే, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి రెండు రోజులుగా కెమికల్ దుర్వాసన వస్తుంది అని కాలనీ వాసులు వాపోతున్నారు. దీని వల్ల కాలనీలో మొత్తం కెమికల్ వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Read Also: YS Sharmila: నేడు జగన్‌ ఇంటికి షర్మిల.. ఆ తర్వాత ఢిల్లీకి

ఇక, ఎన్టీవీతో వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడీ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ.. మా కాలనీలో భారీ పేలుడు శబ్దంతో భయాందోళనలకు గురయ్యమన్నారు. కిలో మీటర్ మేర మా కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి పర్మిషన్ ఇచ్చారు.. నిన్న రాత్రి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ పేలుడు సంభవించింది అని వారు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి గత రెండు ముడు రోజుల నుంచి కెమికల్ దుర్వాసనతో విష వాయువు తమను ఉక్కిరి బిక్కిరి అవుతూన్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Apple : పిల్లలకు యాపిల్ తినిపిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త ప్రాణాలకే ప్రమాదం

గాల్లోకి డ్రైనేజ్ మాన్ హోల్స్ ఎగిరి పడ్దాయని స్థానికులు చెప్పుకొచ్చారు. దీంతో కాలనీలో మొత్తం కెమికల్ వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము.. ఇంకా భయాందోళనలో ఉన్నాం.. స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డితో పాటు అధికారులు వచ్చి చూశారు.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం చూపలేదు అని కాలనీ వాసులు వాపోయారు. అయితే, మరోవైపు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Exit mobile version