Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Accident

Accident

Accident: నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ ప్లాజా దగ్గర శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ ఢీ కొట్టడంతో.. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీ కొట్టగా.. అదే, సమయంలో ఎదురుగా ప్రైవేట్‌ బస్సు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ప్రైవేట్‌ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.