రాజస్థాన్ కోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తపై వరకట్నం కేసు పెట్టింది. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోర్టుకెక్కింది. దీనిపై విచారణ చేసిన న్యాయమూర్తి భార్యకు రూ.55,000 భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. దీంతో భర్త భార్యకు భరణం ఇచ్చేందుకు ఏకంగా ఏడు బస్తాల చిల్లర నాణాలను పట్టుకొచ్చాడు. అవన్నీ రూపాయి, రెండు రూపాయలు, పది రూపాయల కాయిన్స్. ఆ నాణాలు మొత్తం 280కిలోల బరువున్నాయి. దీంతో జడ్జి షాక్ కు గురయ్యాడు. దీంతో సదరు భర్తకే జడ్జి షాకిచ్చారు.
Read Also: Rajinikanth: రిలీజ్ డెడ్ లైన్ ఉన్నా ప్రమోషన్స్ మాత్రం సున్నా…
రాజస్థాన్ లోని జైపూర్ హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్ అనే వ్యక్తికి 12సంవత్సరాల కిందట సీమా అనే మహిళతో పెళ్లైంది. కొంతకాలం తరువాత సీమ భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు గత ఐదేళ్లుగా విచారణ జరుగుతుంది. ఈక్రమంలో తాజాగా ఈకేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి భార్యకు భరణం కింద నెలకు రూ.55,000వేలు చెల్లించాలని దశరథ్ ను ఆదేశించింది.
Read Also: TS Assembly Elections: నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. కలెక్టర్లు, ఎస్పీలతో కీలక భేటీ..?
కోర్టు ఆదేశాలను దశరథ్ పట్టించుకోలేడు.. దీంతో అతన్ని జూన్ 17న అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీంతో అతని కుటుంబసభ్యులు దిగి వచ్చారు. భరణం చెల్లించే డబ్బులు పట్టుకుని కోర్టుకు తీసుకువచ్చారు. అవన్నీ చిల్లర నాణాలు.. అలా ఏడు బస్తాల నాణాలు పట్టుకొచ్చారు. ఆ బస్తాలు చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. వాటిని విప్పి చూడగా అందులో మొత్తం కాయిన్స్ ఉండటంతో జడ్జ్ షాక్ అయ్యాడు.
Read Also: Ashes Test 2023: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి.. పలు రికార్డులు బద్దలు!
చిల్లర నాణాలు తీసుకురావడంతో సీమా తరపు న్యాయవాది రామ్ ప్రకాశ్ కుమావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింటుకు చెల్లించాల్సిన జీవనభృతిని నాణేల రూపంలో ఇవ్వాలనుకోవటం కక్షసాధింపు చర్య కిందకే వస్తుందని వాదించారు. దీంతో ఇవన్నీ లెక్కకట్టి ఇవ్వాల్సిన బాధ్యత మీదే అంటూ షాకిచ్చారు. దీంతో వినూత్న ఆదేశాలు జారీ చేస్తు.. జైల్లో ఉన్న దశరథ్ ఈ నాణేలను రూ.1000 చొప్పున బ్యాగుల్లో ఉంచి, ఈజీగా లెక్కపెట్టేందుకు వీలుగా కోర్టుకు అందించాలని అన్నారు. పైగా జూన్ 26 లోగా ఈ పని పూర్తి చేయాలని జడ్జ్ ఆదేశించారు.