NTV Telugu Site icon

Minister Seethakka : అంగన్వాడి కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలి

Minister Seethakka

Minister Seethakka

మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ స్కీంల అమలు, అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలని, అంగన్వాడి టీచర్లతో పాటు ఆయాలకు సైతం శిక్షణ కార్యక్రమాలు తరచు నిర్వహించాలన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీలో చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇవ్వాలని, అప్పుడే చిన్నపిల్లలకు తినడానికి అనువుగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క. గుడ్డులో ఏదన్నా నలత వున్నా గుర్తించడానికి వీలవుతుందని, అంగన్వాడి కేంద్రాల్లో కోడిగుడ్లను, వస్తువులను భద్రపరచుకునే వ్యవస్థను కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే పాత్రలను, కోడిగుడ్లను భద్రపరిచే శేల్ఫ్ లను అందజేస్తామని, టేక్ హోమ్ రేషన్ లో భాగంగా ఇస్తున్న వస్తువుల నాణ్యతపై లబ్ధిదారుల నుంచి లికిత పూర్వకంగా ధ్రువీకరించుకోవాలన్నారు.

Rice: అన్నం తింటే బరువు పెరుగుతారా.. ఇందులో నిజమెంత..?

పై అధికారులు అంగన్వాడీ కేంద్రాలను విరివిగా సందర్శించాలని, అంగన్వాడి కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మంత్రి సీతక్క. అంతేకాకుండా.. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తామని, అంగన్వాడి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలుంటాయని, వచ్చే నెల 4వ తారీఖు నుండి జిల్లాల పర్యటనలు ఉంటాయన్నారు. పూర్వ ప్రాథమిక పాఠాలను బోధించేలా అంగన్వాడి కేంద్రాలను సమాయత్తం చేయాలని, దేశానికి ఆదర్శంగా మన అంగన్వాడీ పాఠశాలలు ఉండాలన్నారు సీతక్క. ఆ దిశలో టీచర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

Assam: ముస్లిం వివాహాలు-విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం..