Site icon NTV Telugu

AP Registrations: మొరాయిస్తున్న సర్వర్లు.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

Registrations

Registrations

AP Registrations: ఏపీలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లు రెండు రోజులుగా మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాసేపు రిజిస్ట్రేషన్లు జరిగితే కాసేపు నిలిచి పోతున్నాయి. అప్లికేషన్ ఓపెన్ అవకపోవటంతో ప్రక్రియ ముందుకు కదలడం లేదు. తాజాగా ఇవాళ సర్వర్లు పూర్తిగా షట్‌డౌన్‌ అయ్యాయి. సర్వర్లు షట్‌డౌన్‌ కావడంతో రిజిస్ట్రేషన్‌ సేవలకు అంతరాయం కలిగింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.

Read Also: Nallapareddy Prasanna Kumar Reddy: భగవంతుడు కూడా నిన్ను క్షమించడు.. ఎక్కడ పోటీ చేసినా నీకు డిపాజిట్ కూడా రాదు..!

ఉదాహరణకి పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకి 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు అవ్వాల్సి ఉండగా 30 నుంచి 40 అవుతున్న పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్యను ఎప్పటికప్పుడు హెడ్ ఆఫీసుకు సిబ్బంది మెయిల్ చేస్తున్నారు. వారం నుంచి ఇదే సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్య పరిష్కరించే పనిని ఎప్పటికప్పుడు టెక్నికల్ టీం చేస్తోంది. త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

 

Exit mobile version