దేశ రక్షణకి అహర్నిశలు కృషి చేసే సైనికుడు అతను. దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచెయ్యని పోరాటయోధుడు ఆర్మీ జవాన్. దేశ రక్షణలో బాధ్యత వహిస్తున్న సైనికుడు తన కుటుంబ సభ్యులని చూడాలని సెలవు తీసుకుని వచ్చాడు. ఇంటికి రావడమే అతని పాలిట శాపమైంది. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.
Read also:Hyderabad: ట్రాఫిక్ అలర్ట్.. 11 రోజులు, ఈ రూట్లలో వాహనాలకు అనుమతి లేదు
వివరాలలోకి వెళ్తే.. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ పశ్చిమ జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన సెర్టో తంగ్‌తంగ్ కోమ్ ఆర్మీలో యువ సైనికునిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈమధ్యనే సెలవు పైన ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో అతను శనివారం కిడ్నాప్ అయ్యాడు. అతని కుమారుడు చెప్పిన సమాచారం ప్రకారం.. సెర్టో తంగ్‌తంగ్ కోమ్ తన కుమారిడితో కలిసి వరండాలో పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు సెర్టో తంగ్‌తంగ్ కోమ్ ఇంటికి వచ్చారు. వరండాలో పనిచేస్తున్న సెర్టో తంగ్‌తంగ్ కోమ్ తలపైన గన్ పెట్టి బెదిరిస్తూ బలవంతంగా తెల్ల వ్యాన్ లో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. కాగా నిన్న ఉదయం అతని మృత దేహం లభ్యమైంది. పోలీసుల సంచారం ప్రకారం అతని తలమీద ఒక బులెట్ గాయం మాత్రమే వుంది. ఈ ఘటన మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన సైనుకునికి 10 సంవత్సరాల కొడుకు మరియు కూతురు ఉన్నారు.