టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గత కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది..తన అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొడుతుంది ఈ బ్యూటీ..దీంతో ఆమెకు వరుస మూవీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.కొన్ని నెలలుగా శ్రీలీల రోజులో మూడు షిఫ్ట్ లలో షూటింగ్ చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. అయితే, గతేడాది శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ మరియు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీకి కూడా ముందు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.. అయితే, ఈ తరుణం లో శ్రీలీల ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.శ్రీలీల ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని తన చదువుపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం..
శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు. పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. అయితే, గుంటూరు కారం చిత్రం కోసం ఆమె కొన్ని పరీక్షలకు కూడా డుమ్మా కొట్టినట్లు సమాచారం.. దీంతో ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకొని.. చదువుపై దృష్టి సారించాలని శ్రీలీల అనుకుంటున్నట్లు సమాచారం.అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేసేందుకు శ్రీలీల అంగీకరించారు. ప్రస్తుతం ఆ మూవీ ఇంకా మొదలుకాలేదు. అలాగే, పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‍లోనూ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. అయితే, పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది.దీనితో గత నెల రోజులుగా ఏ సినిమాకు శ్రీలీల ఓకే చెప్పలేదు.దీంతో, సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని మెడిసిన్ పరీక్షలకు సిద్ధం అవ్వాలని శ్రీలీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ సినిమాలకు ఓకే చెప్పనున్నట్లు సమాచారం.