NTV Telugu Site icon

Serial Actor Chandu: గత ఐదేళ్లుగా ఇంటికి రాలేదు.. మమ్మల్ని చూడలేదు: చందు తండ్రి

Chandrakanth And Pavitra

Chandrakanth And Pavitra

Serial Actor Chandrakanth Father Press Meet: గత ఐదేళ్లుగా తన కుమారుడు ఇంటికి రాలేదని బుల్లితెర నటుడు చందు (చంద్రకాంత్‌) తండ్రి చెన్న వెంకటేశ్‌ తెలిపారు. త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాంతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బార్య పిల్లల్ని వదిలేశాడన్నారు. పవిత్ర చనిపోయిన తర్వాత చందు డిప్రెషన్‌లోకి వెళ్లాడని వెంకటేశ్‌ చెప్పారు. పవిత్ర మరణం అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు.. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ మణికొండలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

చందు తండ్రి చెన్న వెంకటేశ్‌ మాట్లాడుతూ… ‘పవిత్రతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, భార్య-పిల్లల్ని వదిలేశాడు. గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి రాలేదు. మమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లాడు. మూడు రోజుల క్రితం చందు మా ఇంటికి వచ్చాడు. పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడు. ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని చెప్పాం. అందరం కౌన్సిలింగ్ ఇచ్చాం. నిన్న పొద్దున లక్డికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి.. వెళ్లిపోయాడు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మాకు తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్‌కి పంపించాము. డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీలో సూసైడ్ చేసుకొని వేలడుతూ ఉన్నాడు. మేము వెళ్లేసరికి పోలీసులు వచ్చారు. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారు’ అని అన్నారు.

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్!

చందుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా వారికి అతడు దూరంగా ఉంటున్నారు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్‌ నటి పవిత్రతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా.. మహబూబ్‌నగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చండుకు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం తన ఫ్లాట్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి చెన్న వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show comments