NTV Telugu Site icon

Srinu vaitla : ఆ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ లేనట్టే.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!

Srinu Vaitla

Srinu Vaitla

Srinu vaitla : ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో ఓ సినిమా బ్లాక్‌బస్టర్ అయిందంటే, దానికి సీక్వెల్ చేయాలనే ప్రయత్నాలు గట్టిగా జరుగుతుంటాయి. అయితే, గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఢీ’ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే, ఎప్పటి నుంచో ఈ సినిమాను సీక్వెల్ వస్తుందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అంతే కాకుండా సినిమా టైటిల్ ఇదేనంటూ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీను వైట్ల ఓకే అంటే ఢీ సీక్వెల్ చేస్తానంటూ మంచు విష్ణు చాలాసార్లు చెప్పాడు. కానీ, ఇప్పుడు ఈ సీక్వెల్ గురించి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మంచు విష్ణు కూడా ఈ సీక్వెల్ మూవీని లైట్ తీసుకున్నాడు. అయితే, శ్రీను వైట్లతో మాత్రం ఖచ్చితంగా ఓ సినిమా చేస్తానని అంటున్నాడు.

Read Also : Kolkata Doctor Case: ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన జూనియర్ డాక్టర్లు

ఇక ఇప్పుడు శ్రీను వైట్ల కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చాడు. ‘ఢీ’ సినిమాలో శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి వంటి స్టార్స్ నటించారు. వారు చనిపోవడంతో ఇప్పుడు వారిని రీప్లేస్ చేయడం కష్టమని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీంతో ‘ఢీ’ లాంటి హిట్ మూవీ సీక్వెల్ ఇక లేనట్టే అని అందరూ డిసైడ్ అవుతున్నారు. ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు కేరాఫ్‌ దర్శకుడు శ్రీను వైట్ల. ఢీ, రెడీ, దూకుడు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన రేసులో కాస్త వెనుకబడ్డాడు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వం’. గోపీచంద్, కావ్య తాపర్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also :Kolkata Doctor Case: ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన జూనియర్ డాక్టర్లు

Show comments