Srinu vaitla : ఆ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ లేనట్టే.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinu vaitla : ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఓ సినిమా బ్లాక్‌బస్టర్ అయిందంటే, దానికి సీక్వెల్ చేయాలనే ప్రయత్నాలు గట్టిగా జరుగుతుంటాయి. అయితే, గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఢీ’ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే, ఎప్పటి నుంచో ఈ సినిమాను సీక్వెల్ వస్తుందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అంతే కాకుండా సినిమా టైటిల్ ఇదేనంటూ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీను వైట్ల ఓకే అంటే ఢీ సీక్వెల్ చేస్తానంటూ మంచు విష్ణు చాలాసార్లు చెప్పాడు. కానీ, ఇప్పుడు ఈ సీక్వెల్ గురించి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మంచు విష్ణు కూడా ఈ సీక్వెల్ మూవీని లైట్ తీసుకున్నాడు. అయితే, శ్రీను వైట్లతో మాత్రం ఖచ్చితంగా ఓ సినిమా చేస్తానని అంటున్నాడు.
Read Also : Kolkata Doctor Case: ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన జూనియర్ డాక్టర్లు
Also Read
- RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
- Abhijeet Dipke: ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు
- Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
ఇక ఇప్పుడు శ్రీను వైట్ల కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చాడు. ‘ఢీ’ సినిమాలో శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి వంటి స్టార్స్ నటించారు. వారు చనిపోవడంతో ఇప్పుడు వారిని రీప్లేస్ చేయడం కష్టమని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీంతో ‘ఢీ’ లాంటి హిట్ మూవీ సీక్వెల్ ఇక లేనట్టే అని అందరూ డిసైడ్ అవుతున్నారు. ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శ్రీను వైట్ల. ఢీ, రెడీ, దూకుడు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన రేసులో కాస్త వెనుకబడ్డాడు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వం’. గోపీచంద్, కావ్య తాపర్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also :Kolkata Doctor Case: ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన జూనియర్ డాక్టర్లు
తాజావార్తలు
-
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
-
JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
-
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!